తెలుగు భాష ని మఱింత సరళ తరం చెయ్యడానికి సూచనలు:
అక్షర ప్రక్షాళన:
1) t,d,l,n వంటి ఆంగ్ల అక్షరాలకి రెండు తెలుగు అక్షరాలు ఉండటం గందరగోళం గా ఉంది కాబట్టి :త, ద, ణ, ళ తీసేయాలి
2) చదువు రాని వారికి పలకటానికి కష్టం గా ఉన్న చ కారం, మహా ప్రాణాలూ; చదువుకున్న వాళ్ళకి పలకటానికి కష్టం గా ఉన్న శ, ౘ, ౙ, ఱ,ఋ,ౠ, కారాలు, విసర్గ,క్రయ్యలూ కూడా తీసివెయ్యాలి;
3)ఎ,ఒ లు తీసేసి, జ్ఞ ని గ్య లాగ పలకాలి, అప్పుడే జాతీయ సమైక్యత పెంపొందుతుంది. నాదాలు తీసేసే ఆలోచన పరిశీలన లో ఉంది.
భాష ప్రక్షాళన:
1) సంధులూ, సమాసాలు పిల్లలకి నేర్పకూడదు, వారు సొంతంగా సంధి చెయ్యగలిగితే చేస్తారు,చెయ్యలేకపొతే భాష గతి లో సంధి ప్రక్రియ గతించినది అనుకోవాలి . భాష పేరు తో గ్రాంథికం రుద్ద కూడదు.
2)తెలుగు కి అసలు నిఘంటువే వ్రాయ కూడదు, భాష పరిణామ క్రమం లో ఉన్న పదాలు ఉంటాయి, పొయే కాలం వస్తే పోతాయి.
3) అక్షరాలు తీసేయటం వల్ల నానార్ధాలు పుట్టుకు వస్తే అవి ఆంగ్ల తత్సమాల తో "REPLACE" చెయ్యాలి
ఉదా: పాట, పాత ; కి బదులు సాంగ్(గు), పాత వాడచ్చు.
4) అసలు పదాలని ఇలా వర్గీకరించాలి
అ)ఈక్వలెంట్లూ (ఆంగ్ల-తత్సమాలు) --- బస్సు, కారు;
ఆ) ఆఫ్సెట్లూ (ఆంగ్ల-తద్భవాలు) ----ఆస్పత్రి, రైలు;
ఇ) సరళో-జెనిక్(సరళమైన తెలుగు దేశ్య & గ్రామ్యాలూ) --ఇల్లు,వెలుతురు
ఈ) బార్బరొ-జెనిక్(అనాగరిక, అభివృద్ధి చెందలేక నశించిన సంక్లిష్ట భాషా జన్యాలు) -- గృహం,కాంతి
ఇ,ఈ లు వాడటం ప్రోత్సహించకుండా హౌసూ,లైటూ, అనాలి, అప్పుడందరికీ అర్థమవుతుంది.
5) పరిణామ సిద్ధంతం తెలీని ఛాందసులు ప్రామాణికత పేరు తో భాష వ్యాకరణం రాయకూడదు, ఆ వ్యాకరణం నేర్పిస్తే సూక్ష్మ తడవల లో భాష పరిణామం (point mutations ని) అడ్డుకున్నట్టు, వీరినీ కొత్త పదాలు సృష్టించే వారినీ అతివాదులుగా ముద్ర వేసి దేశం నుండి బహిష్కరించాలి.
స్ఫూర్తి : కె బ్లా స ; (వారికి తెలీకుండా వారి పేరు వాడుకుంటున్నను, వారికి నచ్చక పోతే ఈ పంక్తి మాత్రం తీసేస్తా)
మీ సూచనలకు సదా స్వాగతం
ఇంకా ఉండచ్చు.
అలరారు
బ్లాగిల లో
Thursday, June 16, 2011
Friday, April 8, 2011
ఎప్పటికయ్యది
పని : మనం చేస్తుంటే - కృషి
మఱొకఁడు చేస్తుంటే - కసి
చిట్కా: అమెరికా వాఁడు చెప్తే --చింపేసాడు బాబాయ్
అమ్మ చెప్తే --చాదస్తం బాబోయ్
విషయం: అర్థమైతే -- తర్కబద్ధం
అర్థమవ్వకపోతే -- తొక్కలోది
విలువ : తెలిస్తే -- చోద్యం
తెలీకపోతే -- సోది
మఱొకఁడు చేస్తుంటే - కసి
చిట్కా: అమెరికా వాఁడు చెప్తే --చింపేసాడు బాబాయ్
అమ్మ చెప్తే --చాదస్తం బాబోయ్
విషయం: అర్థమైతే -- తర్కబద్ధం
అర్థమవ్వకపోతే -- తొక్కలోది
విలువ : తెలిస్తే -- చోద్యం
తెలీకపోతే -- సోది
Friday, January 14, 2011
సంకురాత్రి
ఈ సంక్రంతి కి నా చిన్న నాటి అనుభవాలు :
భోగి: భోగి మంట వెయ్యడానికి నేను మా తమ్ముళ్ళు (విన్ని, హర్ష), మా చెల్లెళ్ళు(అనూష,భవ్య), సిరక్క, మురళీ అన్నయ్య దుంగలు పోగేసెవాళ్ళం. ఒకసారి మా దుంగలన్నీ వేరే మంట వాళ్ళు దొబ్బేసారు. అప్పుడు నాకొచ్చినంత కోపం ఇప్పటి వరకూ ఎప్పుడూ రాలేదు. పోగేసినవి కొన్నే ఐనా మా ఇంట్లోవి కొన్ని కొబ్బరి మట్టలూ, డొలక పొత్తులూ గట్రా కలిపితే మంచి మంటే వచ్చేది. మా ఇంటి పక్కన వైదేహి అత్తయ్యగరు కిరసనాయిలు supply చేస్తారు కాబట్టి ఆవిడకి మంటకి ribbon cutting చేసే(వెలిగించే) అవకాశం దక్కేది. మంట తరవాత స్నానం చేసి గుళ్ళో ధనుస్సు పూజ ప్రసాదం తినే వాళ్ళం.
పెద్ద పండుగ : సంక్రాంతి నాడు మాకు తూర్పున ఉన్న పడమటి పాలెం అనే ఊరిలో తీద్దం(తీర్థం) అయ్యేది. అక్కడికి నేను విన్నీ, నాన్న వెళ్ళేవాళ్ళం.మా ఊరిలో చెడుగుడు పోటీలు అవుతాయి కాని నేనెప్పుడూ వెళ్ళలేదు.
కనుమ : కాకీ నీ రూపు నువ్వు తీసుకుని నా రూపు నాకిచ్చేయ్ అని తలస్నానం చేస్తాం (తెల్లగా అయిపొవాలని). కనుమ special గారెలు ,పొంగు బూర్లు, ఆవడలు, అల్లం పచ్చడి తోటి. ఇప్పుడు తలుచుకుంటేనే నోరు ఊరిపోతోంది, ప్చ్ :(.
ఒక్కేడాది ఎడ్ల బళ్ళ ఊరేగింపు లాంటిది జరిగింది మా ఊళ్ళో. కాని ప్రతీ సంవత్సరం ప్రభలు వస్తాయి ఒక అర్ధచంద్రాకారం లొ ఒక ఉన్న ఒక వెదురు అల్లిక కి వెనకతల ఒక గుడ్డ కట్టి ముందు దేవుళ్ళ బొమ్మలు పెట్టి ఊరేగింపు గా తీసుకొస్తారు. రేకపల్లిపాలెం వరకూ. కనుమ నాడు అక్కడ తీర్టం సాయంత్రనికి ఇంటి దగ్గర మదన గోపాల స్వామి గుళ్ళో కనుమ సెవ. పల్లకీ లో దేవుడు ఊరంతా తిరుగుతాడు.
అరే అప్పుడే సంక్రంతి అయిపొయిందా మళ్ళీ రేపణ్ణీంచి స్కూల్కెళ్ళాలి అన్నట్టు ఉండేది.

Subscribe to:
Posts (Atom)